![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -978 లో.. నాకు ఎలాగైనా రిషిని చూపించమని వసుధారని మహేంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. మావయ్య అర్థం చేసుకోండి.. రిషి సర్ బాగున్నారు. ఇప్పుడు మనం రిషి సర్ ని కాపాడుకోవాలని వసుధార ఎంత చెప్పిన వినకుండా రిషి దగ్గరకి వెళదామని మహేంద్ర అంటూ ఉంటాడు. రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని ఆతృతగా చాటు నుండి భద్ర వింటు ఉంటాడు. అప్పుడే అతనికి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ సౌండ్ విని ఎవరో ఉన్నారని వసుధార వెళ్లి చూసేలోగా భద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత చూసావా మన చుట్టు ఏదో జరుగుతుంది. అందుకే వసుధార రిషి గురించి చెప్పడం లేదని అనుపమ అంటుంది. ఆ తర్వాత శైలేంద్రతో భద్ర ఫోన్ లో మాట్లాడుతు.. మీకు కొంచెం కూడా సెన్స్ లేదు. కరెక్ట్ టైమ్ కి ఫోన్ చేశారు. వాళ్ళు రిషి గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు ఫోన్ చెయ్యడం వల్ల వాళ్ళు నా ఫోన్ సౌండ్ విని వాళ్ళు డైవర్ట్ అలెర్ట్ అయ్యారు. లేదంటే రిషి ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసేది. ఇప్పుడెలా తెలుసేదంటు శైలేంద్రపై భద్ర కోప్పడతాడు. భద్ర ఫోన్ కట్ చేసాక మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనుకుంటు వెనక్కి తిరిగేలోపు వసుధార, మహేంద్ర, అనుపమ ముగ్గురు అతని ముందు ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నావని మహేంద్ర అడుగుతాడు. వీళ్లు నా మాటలు విన్నారా అని భద్ర టెన్షన్ పడుతాడు కానీ వినలేదని తెలిసి ఎవరో కాల్ చేసి విసిగిస్తున్నారు అంటు కవర్ చేస్తాడు. కానీ వసుధారకి డౌట్ వచ్చి ఫోన్ లాక్కొని చూస్తే అది శైలేంద్ర నెంబర్ కాదని తెలుస్తుంది. రివర్స్ డ్రామా ప్లే చేస్తు నమ్మకం లేకపోతే నేను వెళ్తానంటు భద్ర అనగానే.. అదేం లేదు నువ్వు వెళ్లి పని చూసుకో అంటు అనుపమ పంపిస్తుంది.
ఆ తర్వాత దేవయానికి రాజీవ్ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ శైలేంద్ర లిఫ్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు పరిచయం లేదు కాబట్టి కాసేపు నువ్వు ఎవరంటే? నువ్వు ఎవరంటూ కోపంగా మాట్లాడుకుంటారు. కాసేపటికి దేవయాని వచ్చి ఫోన్ తీసుకొని రాజీవ్ తో మాట్లాడుతుంది. ఈ రాజీవ్ ఎవడని కన్ఫ్యూషన్ లో శైలేంద్ర ఉంటాడు. రాజీవ్ దేవయానిని కలిసి మాట్లాడాలని, మీ అబ్బాయిని కూడా తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక చక్రపాణికి వసుధార ఫోన్ చేసి రిషి బాగోగులు కనుక్కుంటుంది. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర కలిసి రాజీవ్ కోసం ఒక దగ్గర వెయిట్ చేస్తు ఉంటారు. అసలు ఈ రాజీవ్ ఎవరని దేవయానిని శైలేంద్ర అడుగుతాడు. వసుధార బావ రాజీవ్. తనని ఇష్టపడ్డాడంటు అప్పుడు రాజీవ్ చేసిన కుట్రల గురించి మొత్తం శైలేంద్రకు దేవయాని చెప్తుంది. వసుధారపై ఇంత కథ నడించిందా? ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు.. అయినా ఇప్పుడు వీడిని మనం ఎందుకు కలుస్తున్నామని శైలేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |